బెల్లంపల్లి, హనుమాన్ బస్తి లో సమగ్ర కుటుంబ సర్వే షురూ
ముఖ్యఅతిథిగా పాల్గొన్న చైర్ పర్సన్ శ్వేతా శ్రీధర్ మున్సిపల్ కమిషనర్
నేటి ప్రజా తెలంగాణ బెల్లంపల్లి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు 33వ వార్డు కౌన్సిలర్ పోలు ఉ మాదేవి శ్రీనివాస్, చైర్ పర్సన్ శ్వేతా శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో హనుమాన్ బస్తి ఏరియాలో సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో కుటుంబ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామం అని, ఈ సర్వే వలన ఎవరికి నష్టం ఉండదని ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు పట్టించుకునే పరిస్థితులలో లేరని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సివల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆర్ పి, అరుణ అంగన్వాడీ టీచర్ పద్మ, సర్వే సూపర్ వైజర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోలు శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బండి రాము,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.