బెల్లంపల్లి ‘మెరుగైన వైద్య సేవలు అందించాలి’
ఆర్డీవోకు వినతి పత్రం అందించిన కాలనీవాసి మహేష్ కుమార్.
బెల్లంపల్లి, నవంబర్ 13 సూర్య రేఖ
బెల్లంపల్లిలోని రడగంబాల బస్తిలోని హెల్త్ సెంటర్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కాలనీవాసులు కోరారు. ఈ మేరకు ఆర్డీవో హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు. కాలనీవాసులు మహేశ్ కుమార్ మాట్లాడుతూ. బస్తీలోని కాలనీలలో పలువురు జ్వరాలతో బాధపడుతున్నారని, ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు, సిబ్బంది పెంపుదలకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో, బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు.