Praja Telangana
తెలంగాణ

సివిల్ జడ్జి నివాస గృహాన్ని ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

నేటి ప్రజా తెలంగాణ బెల్లంపల్లి , బెల్లంపల్లి పట్టణంలో గల కన్నాల రాష్ట్రీయ రహదారిపై నూతనంగా నిర్మించిన బెల్లంపల్లి సివిల్ జడ్జి గృహాన్ని శనివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇ.వి వేణుగోపాల్ ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా బెల్లంపల్లి సివిల్ జడ్జి జె.ముఖేష్, మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, అసిస్టెంట్ కలెక్టర్ మోతిలాల్, బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ లతో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చాలు అందించి, గుస్సాడీ నృత్యాలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన కోర్టు ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జడ్జి నివాస గృహానికి ప్రారంభోత్సవం చేశారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ జోష్ణ, ఎంపీడీవో మహేందర్, బెల్లంపల్లి రూరల్, మందమర్రి, తాండూర్ సిఐలు సయ్యద్ అఫ్జలొద్దీన్, శశిధర్ రెడ్డి, కుమారస్వామి, ఎస్సైలు రమేష్, ప్రవీణ్, ప్రసాద్,ఆంజనేయులు, ప్రసాద్, మంచిర్యాలకు చెందిన సీనియర్ న్యాయవాదులు ఎం.రవీందర్ రావ్, కోట మల్లయ్య, బెల్లంపల్లికి చెందిన సీనియర్ న్యాయవాదులు గోపి కిషన్ సింగ్, ఎం శ్రీనివాస్ ,బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిప్ప మనోహర్, న్యాయవాదులు అంకం శివ కుమార్, చేను రవికుమార్, ఎల్. రాము, సింగతి రాజేష్, సంతోష్, రాజేష్, రాజు, అనిల్, సంతోష్, ఎం .సంగీత, టి. ఉమారాణి లతోపాటు కోర్టు సిబ్బంది, అటవీ, పోలీసు శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాదులో బీసీల హక్కుల సాధనకై జరుగుతున్న అమరణ నిరాహార దీక్ష కు మద్దతుగా బీసీ సంఘాల ఐక్యవేదిక

బెల్లంపల్లి హనుమాన్ బస్తి ఆదర్శ గ్రంథాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

నిరుపేద కుటుంబం నుంచి ఎస్జిటి ఉద్యోగం పొందిన..అక్క చెల్లెలు

Share via