పట్టణంలోని 13వ వార్డులో నెలకొన్న సమస్యలను వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ శుక్రవారం మార్నింగ్ వాక్ లో భాగంగా గాంధీనగర్ బస్తీలో తిరుగుతు ప్రజలను పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బందితో కాలువలలో పూడీకలు తీయించి, రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించాలని సిబ్బంది కి సూచించారు. అక్కడక్కడ సిసి రోడ్ల ప్యాచ్ వర్క్ కోసం పగిలి పోయి ఉన్న రోడ్లకు మరమ్మత్తులు చేయిస్తానని వార్డు ప్రజలకు తెలియజేశారు. అంతేకాకుండా గంగారాం నగర్ ఏరియాలోని ఓ ఇంటి ముందున్న చెట్టుకు కరెంటు తీగలు తగిలి అప్పుడప్పుడు కరెంటు పోతుండటంతో చెట్టును కట్టింగ్ మిషన్ తో కట్ చేయించారు. వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్ చేస్తున్న కృషి కి స్థానిక వార్డు ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
previous post