మాదిగల ధర్మయుద్ద సభను జయప్రదం చేయండి
నేటి ప్రజా తెలంగాణ, మందమర్రి టౌన్.
ఈ నెల 27 న జన్నారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆద్వర్యంలో నిర్వహించనున్న మాదిగల ధర్మయుద్ధ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సి ల వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు మాట ఇచ్చి ఇప్పుడు మాలల ఒత్తిళ్లకు తలొగ్గి వర్గీకరణ అంశాన్ని జాప్యం చేస్తు మాదిగలకు తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారని ఆయన మండి పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సి వర్గీకరణ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 27న జన్నారం మండల కేంద్రంలో ఉమ్మడి జిల్లా మాదిగల ధర్మయుద్ద సదస్సు నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించడం జరుగుతుందని ఈ సభకు మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్య్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి జీడి సారంగం మాదిగ, మండల అధ్యక్షులు అసంపల్లి శివకుమార్ మాదిగ, పట్టణ ఇంచార్జి చిలుముల రాజుకుమార్, గౌరవ అధ్యక్షులు రాచర్ల సరేష్ మాదిగ, అయిందాల సధి మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు మాడుగుల రాజు కుమార్ మాదిగ, నందిపాటి రాజు కుమార్, చిలుముల కుమార్ మాదిగ, కన్నూరి రాజేందర్ మాదిగ, రాం వంశీ మాదిగ, ఆసంపల్లి తిరుపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.