Praja Telangana
తెలంగాణ

ఒకే కుటుంబంలో ముగ్గురికి ఎంబిబిఎస్‌లో ప్రవేశం పొందడం అభినందనియం*

.
*ఒకే కుటుంబంలో ముగ్గురికి ఎంబిబిఎస్‌లో ప్రవేశం పొందడం అభినందనియం*

*విద్యార్థులను శాలవతో సత్కరించి అభినదించిన పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ*

*రంగారెడ్డి జిల్లా :శేరిలింగంపల్లి నేటి ప్రజా తెలంగాణ*

శేరిలింగంపల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ప్రెసిడెంట్ కృష్ణ రావు కుమారుడి పిల్లలు మనవడు జయ గోపాల్ క్రిష్, అపోలో ఆసుపత్రి, మనవరాలు కృష్ణ కామినేని ఆసుపత్రి, మనవరాలు సౌమ్య మహబూబ్ నగర్ ఆసుపత్రి లో వైద్య విద్య ను అభ్యసించడానికి ప్రవేశం పొందడం జరిగినది .ఈ సందర్భంగా వారికి శాలవతో సత్కరించి ప్రత్యేకంగా అభినదించిన పిఎసిచైర్మన్ ఆరెకపూడి గాంధీ.
ఈ సంధర్భంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఒకే కుటుంబంలో ముగ్గురు ఎంబిబిఎస్‌లో ప్రవేశ పొందడం చాలా అభినదించదగ్గ విషయం అని, కృష్ణ రావు నీ అతని మనవడు మనవరాలను ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని తెలియచేసారు.
పట్టుదలతో కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు అని. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను అని , వైద్య వృత్తి ని ఎంచుకొని సమాజంలో గొప్ప వృత్తి ,ప్రాణం పొసే డాక్టర్ వృత్తి గొప్పది అని , బాగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు గల డాక్టర్ లుగా సమాజంలో సేవ చేయాలని పేద వారికి, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించెలాని ఆకాక్షించారు.
విద్యార్థులు, యువత తాము ఎంచుకున్న మార్గాలలో కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని , ఎంచుకున్న మార్గాలలో సడలని పట్టుదల , కృషి ఉంటె సాదించలేనిది ఏది లేదు అని ,భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులు వారి పిల్లల అభిరుచులకు తగ్గట్టు శిక్షణ ఇప్పిస్తే వారు ఎంచుకున్న రంగాలలో అద్భుత ఫలితాలు సృష్టిస్తారు అని ,ఉన్నత శిఖరాలను అధిరోహించి మన దేశ ఖ్యాతిని నలుదిక్కుల విశ్వవ్యాప్తం చేస్తారని పిఎసి చైర్మన్ ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమములో ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ప్రెసిడెంట్ కృష్ణారావు, కట్టశ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆటో యూనియన్ ఎలక్షన్ లో రెండోసారి విజయం సాధించిన కట్ట రామ్ కుమార్.

బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన మంచిర్యాల అధ్యక్షుడు బాల్క సుమ న్

Share via