*ఈ నెల 19న మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత*
*మిషన్ భగీరథ మంచిర్యాల డివిజన్ ఈ.ఈ. కె. మధుసూదన్*
మంచిర్యాల,
అక్టోబర్, 18, 2024 :
జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఈ నెల 19న మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని మిషన్ భగీరథ మంచిర్యాల డివిజన్ ఈ.ఈ. కె. మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్ భగీరథ – గ్రిడ్ మంచిర్యాల పరిధిలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో తలెత్తిన నిర్వహణ సమస్య కారణంగా మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాలలో నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, దండేపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, భీమారం, హాజీపూర్, కోటపల్లి, చెన్నూర్ మండలాలు, మంచిర్యాల, చెన్నూర్, మందమర్రి, నస్పూర్, క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపాలిటీలలో ఈ నెల 19న నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.