*వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన తాటి.*
నేటి ప్రజా తెలంగాణ అశ్వరావుపేట
దమ్మపేట మండలం రాచురపల్లి గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ. తో కలిసి బహుమతులు అందజేసిన *అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు * ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుండే క్రీడల్లో చురుకుగా పాల్గొనడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారని అన్నారు. క్రీడలు వల్ల శారీరకంగా దృడంగా మానసికంగా దృడత్వాన్ని సాధిస్తారు. అన్నింటికి మూలమైన ఆరోగ్యాన్ని సాధించాలంటే యువతకు క్రీడలపై ఆసక్తి పెంచేందుకు క్రీడలు దోహద పడతాయని అన్నారు. క్రీడల్లో రాష్ట్ర జాతీయస్థాయిలోరాణించాలని కోరుకున్నారు… ఈ కార్యక్రమంలో సోయం వీరభద్రం , కట్టం ఎర్రప్ప , అంకిత ఉమామహేశ్వరరావు
, బాలాజీ , వాడే వీరస్వామి తదితరులు పాల్గొన్నారు…