Praja Telangana
తెలంగాణ

నూతన రాజస్వ మండల అధికారి కార్యాలయం ప్రారంభం*

*నూతన రాజస్వ మండల అధికారి కార్యాలయం ప్రారంభం*

*జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

నేటి ప్రజా తెలంగాణ :మంచిర్యాల

ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో నూతన రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి వి.రాములు, ఎ.సి.పి. ప్రకాష్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ప్రజలకు మరింత సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లతో నూతన రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, తహశిల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీసీ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామస్థాయికి తీసుకుపోవాలని వక్తల పిలుపు.

తూప్రాన్ బాయ్స్ రెసిడెన్షియల్స్ స్కూల్లో దారుణం.*

Beuro Inchange Telangana: Saleem

చెన్నూరులో రాస్తారోకో చేసిన బీ ఆర్ఎస్ నాయకులు

Share via