Praja Telangana
తెలంగాణ

హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం..!!*

*హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం..!!*

నేటి ప్రజా తెలంగాణ – హర్యానా

చండీగఢ్‌: హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ సాగనుంది. మొత్తం 20,632 పోలింగ్‌ కేంద్రాల్లో 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసు బృందాలు మోహరించాయి.

చిన్న రాష్ట్రమే అయినప్పటికీ దేశ రాజకీయాల్లో హరియాణా కీలక పాత్ర పోషిస్తుంటుంది. పదేళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న భాజపా.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ అదంత సులభం కాదు. దీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతోపాటు కుల సమీకరణాలు ఆ పార్టీకి ఈసారి ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

హరియాణా ఎన్నికల ముఖచిత్రం

మొత్తం నియోజకవర్గాలు 90
బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 1,031
వారిలో మహిళలు 101
స్వతంత్ర అభ్యర్థులు 464
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,03,54,350
వారిలో పురుషులు 1,07,75,957
మహిళలు 95,77,926
ట్రాన్స్‌జెండర్లు 467
పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 20,632

Related posts

దుర్గ నవరాత్రి వేడుకలో పాల్గొన్న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి.

మధుర జ్ఞాపకాలు పంచి స్ఫూర్తి నింపిన పారుపల్లి ప్రధానోపాధ్యాయుడు*

కంప్యూటర్ అవగాహనకై అనాధాశ్రమంలో లాప్ టాప్ పంపిణి

Share via