Praja Telangana
తెలంగాణ

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

నేటి ప్రజా తెలంగాణ, మందమర్రి టౌన్

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. స్వచ్ఛతా హి సేవ 2024, స్వభావ స్వచ్ఛతా, సంస్కార స్వచ్ఛతా కార్యక్రమాల ముగింపు వేడుకల్లో భాగంగా బుధవారం పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ విభాగంలోని పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు‌. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛతా హి సేవా 2024 కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈసందర్భంగా పారిశుద్ధ్య పనులు నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను ఆయన ప్రశంసించారు. అందరి ఆరోగ్య బాధ్యతలను పారిశుద్ధ్య కార్మికులే మోస్తున్నారని, ప్రజలు నడిచే దేవుళ్లు అని కొనియాడారు. పరిశుభ్రతకు మన వంతు సహకారం అందిస్తేనే వారి కష్టాన్ని కొంతైనా తగ్గించిన వారమవుతామన్నారు. అక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా, నిర్దేశించిన ప్రదేశంలో చెత్త ఉంచాలని, అలాగే ఇళ్లలోని చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని సూచించారు. ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఆలోచన చేయాలన్నారు‌. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారి పి కృష్ణ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ వి శ్యాంసుందర్, హెల్త్ అసిస్టెంట్ ఎంఏ సమీర్, జూనియర్ అసిస్టెంట్లు జహీర్, ఈ వసంత్, ఎన్ రాజ్ కుమార్, ఇన్చార్జ్ టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఏనుగు రఘురాం, పర్యావరణ ఇంజనీర్ ఎం గోపికృష్ణ, డాటా ప్రాసెసింగ్ అధికారి బొల్లు శ్యాంబాబు, సిస్టం మేనేజర్ ఏ శిరీష్, సిస్టమ్ అసిస్టెంట్ వి ప్రభాకర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ వర్కర్ చిప్పకుర్తి రాజశేఖర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రంజాన్ పర్వదినాన సాయి భోజన్*- రంజాన్ పర్వదినాన సాయి భోజన్*-

రామగుండం ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి*

Share via