కలెక్టర్ కలిసిన ఆదివాసీ నాయకులు.
నేటి ప్రజా తెలంగాణ అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. దమ్మపేట మండలం కేంద్రం లో ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయింపు పై ప్రజావాణి, ప్రజా దర్బార్ లో కలెక్టర్,పి.ఓ గార్లకు మెమోరాండం అందజేసిన దమ్మపేట మండల జె.ఎ.సి నాయకులు
దమ్మపేట మండల కేంద్రం లో ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ నందు గ్రీవెన్స్ డే ప్రజావాణి కార్యక్రమం లో దమ్మపేట మండలం ఆదివాసీ జె.ఎ.సి నాయకులు పాల్గోని జాయింట్ కలెక్టర్ కి. మెమోరాండం ను సంబంధిత అధికారికిఅందజేసారు.తదుపరి భద్రాచలం ఐ.టి.డి.ఎ కార్యాలయం భద్రాచలం నందు ప్రజా దర్బార్ లో ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ బొజ్జా. కి దమ్మపేట మండలం కేంద్రం లో ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయింపు నకు చోరవ చూపాలనీ, అంకంపాలెం గురుకుల బాలికల డిగ్రీ కళాశాలను తిరిగి అంకంపాలెం రప్పించాలని ఆదివాసీ జె. ఎ.సి తరపున ప్రాజెక్ట్ అధికారి రాహుల్ బొజ్జా కి వినతిపత్రం అందించి కోరారు.సానుకులం గా స్పందించిన పి.ఓ రాహుల్ గారు తప్పకుండ దమ్మపేట మండలం ఆదివాసీ కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయింపు విషయము పై సంబంధిత అధికారులు తో మాట్లాడి అనువైన స్థలం మంజూరు చేస్తాo అని అలాగే దసరా తరవాత అంకంపాలెం కు డిగ్రీ కళాశాలను తిరిగి తెప్పిస్తాను అని ఆదివాసీ నాయకులకు ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ గారు హమీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో ఆదివాసీ నాయకులు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు కొరసా వెంకటేష్ దొర , దమ్మపేట మండల జె .ఎ .సి నాయకులు గడ్డం వెంకటేశ్వరరావు,బండారు సూర్యనారాయణ,కాసిని వెంకటేశ్వరరావు,కారం శ్రీరాములు,సోయం వీరభద్రం,పరిష్క .మారేష్,కారం బొజ్జి,సోయం రామ్మూర్తి, వాసం.పోలరావు,కట్టం ఎర్రప్ప,అప్పిరెడ్డి వెంకన్న,
తంబల్లా రవి,కోర్సా వెంకటేష్,మడకం ప్రసాద్,కట్టం.ప్రసాద్,కారం.వసంత్,కారం వెంకట్రావు,కొమరం రాము,చేపా.నాగరాజు,కోర్సా.ప్రతాప్,గుల్లా రాంబాబు ,కోర్సా.శ్రీను,కోర్సా.శరత్ బాబు,కారం.నాగేంద్ర బాబు కాంతారావు,వంకా.వరాలబాబు,వాడే వీరాస్వామి పాల్గొన్నారు