*కొల్లూరులోకొల్లూరులో కలుషితం అవుతున్న మంచినీరు* కలుషితం అవుతున్న మంచినీరు*
*కలుషితం అయినా నీళ్లు త్రాగడం వల్లన అనారోగ్యాల పాలవుతున్న కొల్లూరు గ్రామ ప్రజలు*
*సంగారెడ్డి జిల్లా: నేటి ప్రజా తెలంగాణ*
పటాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలోనీ కలుషితమైన నీరు త్రాగి రోగాల బారిన పడుతున్న కొల్లూరు గ్రామ ప్రజలు
ఈ సందర్భంగా వెలిమెల బాల్ రాజు మాట్లాడుతూ కొల్లూరు గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా మంచినీళ్ల పైపులైను పగిలిపోవడం వలన తాత్కాలికముగా మరమ్మతులు చేపట్టిన వాటర్ బోర్డ్ సిబ్బంది పెద్ద గొయ్యి తీసి వదిలేయడం వలన అతి దగ్గరలో ఉన్న డ్రైనేజీ లీకేజీ అవ్వడంతో ఆ నీరు ఆ గొయ్యిలోకి చేరి మురికి నీరు మంచినీళ్ల పైప్ లైన్ లోకి ప్రవేశించి మంచినీరు మురికి నీళ్లుగా మారుతుంది
ఈ నీళ్లు త్రాగడం వలన గ్రామస్తులు అనారోగ్యాల బారిన పడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అని అన్నారు వీలైనంత తొందరగా కొత్త పైపులైను వెయ్యగలరని స్థానికులు కోరుతున్నారు అలాగే డ్రైనేజీ పనులను కూడా వీలైనంత తొందరగా సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు వెలిమెల బాలరాజు, సునీల్, చిన్న