Praja Telangana
తెలంగాణ

పవర్ ప్లాంట్ కార్మికులని కూడా లాభాల వాటలో చేర్చాలి.

పవర్ ప్లాంట్ కార్మికులని కూడా లాభాల వాటలో చేర్చాలి. చర్యలు చేపడుతామన్న డైరెక్టర్ పా.ఈడి రాజేశ్వరరావు హామీ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో చర్చలు. నేటి ప్రజా తెలంగాణ – జైపూర్ జైపూర్ మండలంలోని థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను సింగరేణి అమలు చేసిన బోనస్ లో భాగంగా వారిని కూడా చేర్చాలని సింగరేణి యాజమాన్యం దృష్టికి లాభాల వాటా బోనస్ విషయంలో హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ చిప్పకుర్తి సంపత్ .సాయి కృష్ణారెడ్డి. ఆధ్వర్యంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ కార్మికులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్వరరావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా దీనిపై స్పందించి డైరెక్టర్ పా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది . గైడ్ లైన్స్ ఇంకా విడుదల కాలేదు కావున అందులో మన పవర్ ప్రాజెక్టు కూడా చేర్చే విధంగా చర్యలు చేపడుతామని డైరెక్టర్ పా, ఈడి రాజేశ్వరరావు హామీ ఇవ్వడం జరిగింది. రేపు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరగబోయే చర్చల్లో భాగంగా సింగరేణి యాజమాన్యం కార్మికులకు, భూ నిర్వాసిత కార్మికులకు పర్మినెంట్ చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు పర్మనెంట్ చేయాలని కాంట్రాక్టు కార్మికులకు 5000 రూపాయలు అలవెన్సెస్ అందజేసే విధంగా అగ్రిమెంట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది . లేనియెడల ప్రధావిత గ్రామ ప్రజలను కలుపుకొని తీవ్రమైన ఉద్యమం చేపడతామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎంఎస్ నాయకులు ఆర్గనైజింగ్ సెక్రెటరీ నవీన్ సత్యనారాయణ చారి పాల్గొన్నారు.

Related posts

వినాయక నిమజ్జనానికి సహకారం అందించండి

Beuro Inchange Telangana: Saleem

ఘనంగా సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం

*బెల్లంపల్లి TBGKS ఆఫీస్ ను పునరిమాణన్ని కి పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య*

Share via