Praja Telangana
తెలంగాణ

గిన్నిస్ బుక్‌లోకి మెగాస్టార్ చిరంజీవి!

గిన్నిస్ బుక్‌లోకి మెగాస్టార్ చిరంజీవి!

నేటి ప్రజా తెలంగాణ – హైద‌రాబాద్

మెగాస్టార్‌కి మ‌రో గౌర‌వం ద‌క్కింది. 156 సినిమాలు.. 537 పాట‌లు.. 24,000 స్టెప్పులు. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది. హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చిరంజీవికి అందచేసారు. డాన్స్‌కి అడ్ర‌స్‌గా నిలిచిన మెగాస్టార్ ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 156 మూవీల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో ఎక్క‌డం లో మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండాపోయాయి.

Related posts

పబ్లిక్ పైప్ బండిల్ ను దొంగరించిన దొంగ అరెస్ట్

పెద్ద పెళ్లి ఎంపీగా గడ్డం వంశిని గెలిపించాలి

మరోసారి తన దాన గుణాన్ని చాటిన ఎంజీఆర్*

Share via