Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి కాంట ఏరియా రూరల్ బస్టాప్ వద్ద కార్యక్రమం*

: .

*జాపతి అభిలాష్ జ్ఞాపకార్థంగా సాయి భోజన్*

*బెల్లంపల్లి కాంట ఏరియా రూరల్ బస్టాప్ వద్ద కార్యక్రమం*

*బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ*

*తెలంగాణ-మంచిర్యాల జిల్లా-బెల్లంపల్లి*

*బెల్లంపల్లి:* బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియాలో రూరల్ బస్టాప్ వద్ద కీర్తిశేషులు జాపతి అభిలాష్ జ్ఞాపకంగా వారి తల్లి జాపతి జలజ మేడం గారి సహకారంతో శుక్రవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని బాటసారులకు ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు,విద్యార్థిని విద్యార్థులకు, ఆకలితో అలమటించే అన్నార్తులకు యాచకులకు వికలాంగులకు వృద్ధులకు, పేదవారికి, సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు. రూరల్ బస్టాప్ వద్ద ఉన్న ప్రయాణికులు బాటసారులు ఆటో డ్రైవర్లు విద్యార్థిని విద్యార్థులు, అన్నార్తులు యాచకులు సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ట్రస్ట్ ద్వారా “ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం” అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని,మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, స్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, సేవకులు కొండ శ్రీధర్, ఎండి యూసఫ్, కుటుంబ సభ్యులు ఎడ్ల నరసింహారెడ్డి, కారింగుల మోహన్ శైలజ, జాపతి అవినాష్ మానస, ఏలువాక అనూష, మీడియా సిబ్బంది, దాతలు ,తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.

Related posts

బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు.

మత్తుమందు వ్యతిరేక అవగాహన కార్యక్రమం ‌.

బెల్లంపల్లి ‘మెరుగైన వైద్య సేవలు అందించాలి’

Share via