Praja Telangana
తెలంగాణ

వినాయక నిమజ్జనానికి సహకారం అందించండి

వినాయక నిమజ్జనానికి సహకారం అందించండి

నేటి ప్రజా తెలంగాణ , మందమర్రి టౌన్

సోమవారం నిర్వహించు వినాయక శోభయాత్ర, నిమజ్జనానికి ప్రతి ఒక్కరు సహకరించి, జయప్రదం చేయాలని మందమర్రి సీఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు, మండల తహశీల్దార్ సతీష్, ఎలక్ట్రికల్ ఏఈ ఎస్టి మల్లేశం, పురోహితులు గోవర్ధనగిరి అనంతచార్యులు, కృష్ణ చైతన్య ఆచార్యులు తెలిపారు. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో పట్టణ పరిధిలోని అన్ని వినాయక మండపాల సభ్యులచే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ లు మాట్లాడుతూ, వినాయక నిమజ్జన మహోత్సవాన్ని సెప్టెంబర్ 16న సోమవారం నిర్వహించుకోవాలని సూచించారు. వినాయకుని శోభాయాత్రలో, నిమజ్జనంలో మద్యం సేవించి పాల్గొనవద్దని, నిమజ్జనానికి చిన్న పిల్లలను తోడుకొని వెళ్లొద్దని తెలిపారు. అదేవిధంగా రెచ్చగొట్టే విధంగా, కవ్వింపు చర్యలకు పాలపాడవద్దన్నారు. పట్టణ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వినాయక మండపాల వద్ద ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మండపాల వద్ద నిర్వహించూ అన్న ప్రసాద వితరణకు సైతం మున్సిపల్ సిబ్బంది సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు వినాయక శోభాయాత్రలో రోడ్డుపై గల గుంతలతో ఇబ్బంది కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా, తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించి, గుంతలను పూడుస్తామన్నారు. ఎలక్ట్రికల్ ఏఈ ఎస్టి మల్లేశం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్తును అందజేస్తుందని, మండలి నిర్వాహకులు విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. పురోహితులు గోవర్ధనగిరి అనంతాచార్యులు, కృష్ణ చైతన్య ఆచార్యులు మాట్లాడుతూ, వినాయక నవరాత్రి విశిష్టతను, ప్రాముఖ్యతను వివరిస్తూ, పండుగను భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. పట్టణ పరిధిలో 142 వినాయక మండపాలు ఏర్పాటు చేసి, అత్యంత వైభవంగా వినాయక నవరాత్రి మహోత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువులు మండలి నిర్వాహకులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, పురోహితులు నరసింహా చారి, అజయ్ చారి, వినాయక మండలి నిర్వాహకులు, పట్టణ పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

గోదావరిఖని గాంధీ చౌరస్తాలో దివంగత కాంగ్రెస్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి కార్యక్రమం

ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమం సందర్భంగా బందోబస్తు ఏర్పాటు పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్

బెల్లంపల్లి లో రోడ్ల ఇరువైపులా ఇష్టానుసారం పెడితే చర్యలు తప్పవు

Beuro Inchange Telangana: Saleem
Share via