ప్రశాంతంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలి
నేటి ప్రజా తెలంగాణ, మందమర్రి టౌన్
ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని పట్టణ ఏఎస్ఐ మాజీద్ ఖాన్ సూచించారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ (ఎస్వీ) ఏరియాలో కల ఓం శ్రీ వరసిద్ధి వినాయక మండపాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వినాయక మండపం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏఎస్ఐ మాజీద్ ఖాన్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చనని తెలిపారు. ఈసందర్భంగా పోలీసు వారి సూచన మేరకు సీసీ కెమెరాను ఏర్పాటు చేసిన వినాయక మండలి నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మండలి నిర్వాహకులు ఎండి ఖాసీం, జాడ క్రాంతికుమార్, రాంసింగ్ , మేకల సాయి కుమార్, భీమా గణేష్, మేకల అరుణ్ కుమార్, కిందింటి కుమార్, రాజు శర్మ, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, హోం గార్డు దాసరి శ్రావణ్ కుమార్ లు పాల్గొన్నారు.