Praja Telangana
తెలంగాణ

ఆర్కే 5 గనిలో మరో ప్రమాదం. 24 గంటలు కాకముందే సింగరేణిలో రెండో ప్రమాదం

ఆర్కే 5 గనిలో మరో ప్రమాదం.
24 గంటలు కాకముందే సింగరేణిలో రెండో ప్రమాదం.
నేటి ప్రజా తెలంగాణ – శ్రీరాంపూర్
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ సంబంధించిన ఆర్కే 5 గనిలో నవీన్ చారి అనే బదిలీ కార్మికునికి చేతికి గాయాలవడం జరిగింది. ఆ గాయంలో అతని చూపుడువేలు, ఉంగరపు వేలు చాలా తీవ్రంగా గాయపడినని తెలుస్తుంది. ఉంగరపు వేలు ఎముక విరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ఇందారం గని వన్ లో జరిగిన ప్రమాదం నుండి కోలుకోక ముందే ఇప్పుడు ఆర్కే ఫైవ్ లో ప్రమాదం కార్మికులని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇలా రోజుకొక ప్రమాదం జరగడం సింగరేణి కార్మికులకు పని భారాన్ని పెంచడం వల్లే అని అక్కడ ఉన్న తోటి కార్మికులు చెప్పారు. పనులకు పంపించేటప్పుడు అధికారులు సేఫ్టీని మరిచి పోతూ కార్మికుల ప్రాణాలు మీదికి తీసుకొస్తున్నారని, కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందారం గనిలో నిన్న జరిగిన సంఘటనని బయట జరిగిన సంఘటనగా చిత్రీకరించడంలో విఫలమైన అధికారులు, ఈ సంఘటనని కూడా కార్మికుని వైఫల్యం వల్లనే జరిగిందని కార్మికుల పైన తోసే ప్రయత్నం చేస్తున్నారని తోటి కార్మికులు అధికారుల పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సేఫ్టీ వారోత్సవాలు జరిగిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటూ కార్మికులను కేవలం తమ యొక్క టార్గెట్లు పూర్తి చేయడానికి పని ఒత్తిడి పెడుతూ వారిపై భారాన్ని మోపుతున్నారని, దీనిలో భాగంగానే సేఫ్టీని మర్చిపోతున్నారని కార్మికులు తెలియజేశారు.

Related posts

కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం

లైబ్రరీ పుస్తకాలు అందించిన ప్రసన్న హరికృష్ణ.

మాదిగల ధర్మయుద్ద సభను జయప్రదం చేయండి

Beuro Inchange Telangana: Saleem
Share via