నేలకొరిగిన మరో నల్ల సూర్యుడు.
*బయట జరిగిన ఘటనగా చిత్రీకరణలో అధికారులు. *
*ఎస్ వన్ ప్యానెల్ ,38 డిప్ లో ఘటన*.
నేటి ప్రజా తెలంగాణ- జైపూర్
జైపూర్ మండలంలోని ఇందారం ఐకె వన్ గనిలో ఎస్ వన్ ప్యానెల్ లో 38 డిప్ వద్ద ఇలవేణి శ్రీనివాస్ అనే వ్యక్తి ఊపిరి ఆడక వెంటిలేషన్ సరిగా లేక మృతి చెందడం జరిగింది. ఇది గనిలో జరిగిన ప్రమాదం కిందికే తీసుకోవాలని, అక్కడే హెచ్ఎంఎస్ లీడర్స్ కోరడం జరిగింది. గనిలో జరిగిన ప్రమాదాన్ని బయట జరిగిన ప్రమాదంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని, చనిపోయిన వ్యక్తికి అనవసరమైన వ్యాధులు అందగడుతున్నారని ఫిట్స్ తో మృతి చెందాడని గుండె నొప్పితో మృతి చెందాడని మరికొందరు చెబుతున్నారు ఇది సరైనది కాదు అని హెచ్ ఎం ఎస్ లీడర్స్ ఘంటపదంగా చెబుతున్నారు. అధికారులకు ఇలాంటివి వారికి తగవని హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని సి అండ్ ఎండి వద్దకు తీసుకు వెళ్తామని, చనిపోయిన కార్మికుని కుటుంబానికి అన్యాయం చేయొద్దని శవంతో రాజకీయ ఆటలాడోద్దని హెచ్ఎంఎస్ నాయకులు తెలియజేశారు. విచారణ జరిపించి ఈ ఘటనకి కారకులు ఎవరో, దీనికి నిర్లక్ష్యం వహించిన అధికారులను 302 సెక్షన్ కింద వారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.