*అమ్మ నాన్నలను కోల్పోయిన ఇద్దరు యువతిలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆర్థిక సాయం..*
నేటి ప్రజా తెలంగాణ, మందమర్రి టౌన్
*గత నెల ఊరు మందమర్రికి చెందిన భూనేని దునాచారి-లక్ష్మి అనారోగ్యంతో ఇద్దరు మరణించడం జరిగింది.ఆ ఇద్దరి దంపతులకు అర్చన,అభిలాష ఇద్దరు కుమార్తెలు. పేదరికంతో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబం తల్లిదండ్రులు కోల్పోవడంతో చదువుకునే ఆ ఇద్దరు ఆడపిల్లలు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి రావడం చాలా బాధాకరం.అది గమనించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది మరియు ఆ యొక్క కుటుంబానికి వెన్నంటి ఉంటామని భవిష్యత్తులో ఎలాంటి సహాయం అందించాలన్న మేము సిద్ధంగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.