* కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
నేటి ప్రజా తెలంగాణ: పెద్దపల్లి
* రామగుండం పోలీస్ కమిషనర్ పి.శ్రీనివాస్
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్,అడ్మిన్ డీసీపీ సి రాజు,ఇతర అధికారులతో లతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది.అనంతరం సీపీ మాట్లాడుతూ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు.అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని,కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం,ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిస్తుందని కొనియాడారు.పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు,యువత పోలీస్ వారి సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.ఇదేవిధంగా నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు,నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏ సి పి ఎం. రమేష్,గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్,ఆర్ ఐ సంపత్,ఆర్ఎస్ఐ శ్రావణి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.