*బైకు దొంగలను పట్టుకున్న మంచిర్యాల పోలీసులు* .*వివరాలు వెల్లడించిన బన్సీలాల్* . *నేటి ప్రజా తెలంగాణ మంచిర్యాల* .సీపీ, రామగుండం మంచిర్యాల డీసీపీ ఉత్తర్వుల మేరకు మంచిర్యాల ఏసీపీ ఆదేశానుసరం సాయంత్రం ఐబీ చౌరస్తా నందు మంచిర్యాల ఇన్స్పెక్టర్ బన్సీలాల్ తన సిబ్బంది ఎస్ ఐ లు సనత్, సురేష్ మరియు కానిస్టేబుల్స్ సుబ్బారావు, సిహెచ్. శ్రీనివాస్, రమేష్ లతో కలసి వాహనాలు తనిఖీ చేయుచుండగా ఇద్దరు వ్యక్తులు 1) నిమ్మల కుమార్, వ,, 19 సం,, లు ని: రేచిని, ప్రస్తుతం చున్నాoబట్టివాడ, మంచిర్యాల 2) నెల్లి సాయి కుమార్ వ,, 20 సం,, లు ని: కాగజ్ నగర్ ప్రస్తుతం చున్నoబట్టివాడ, మంచిర్యాల అను వారు రెండు బైక్ లపై బెల్లంపల్లి చౌరస్తా వైపు వస్తుండగా వారిని ఆపి డాక్యుమెంట్ చెక్ చేయగా వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారిని విచారించగా వారు గత రెండు నెలలుగా ఏ పని చేయకుండా చెడు అలవాట్లకు బానిసై మంచిర్యాల పట్టణంతో పాటు లక్సట్టిపేట్ మరియు కాసిపేట్ లో ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని తమ ఇంట్లో దాచిపెట్టినట్టు తెలిపారు. మంచిర్యాల లో అమ్మితే పోలీస్ వారికి దొరికిపోతామని భావించి రెండు బైక్ లను రేచిని లో అమ్ముటకు తీసుకువెళ్తుండగా పోలీస్ వారు పట్టుకున్నారు అని చెప్పి చున్నముబట్టివాడ లోని వారి ఇంట్లో దాచి ఉంచిన మిగతా రెండు బైక్ లను కూడా చూపించగా ఈ రెండు బైక్ లతో పాటు మిగతా 4 బైక్ లను పోలీస్ వారు స్వాధీన పర్చుకున్నారు అని సీఐ బన్సీలాల్ తెలిపారు. పై ఇద్దరు వ్యక్తులు మంచిర్యాల లో 4 బైక్ లు లక్సట్టిపేట్ లో ఒక బైక్ మరియు కాసిపేట్ లో ఒక బైక్ దొంగిలించినట్లు విచారణలో తేలగా వారిరువురిని పట్టుకున్న 6 బైక్ లతో సహా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ ఓ, బన్సీలాల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు