కలెక్టర్ స్పందించిన తీరు హర్షణియం : టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
*వాగులో చిక్కుకున్న వారు సురక్షితం *
*6 గంటలకు పైగా అక్కడే ఉండి పరిస్థితి సమీక్షించిన సీతారాములు *
నేటి ప్రజా తెలంగాణ – పాల్వంచ
ప్రకృతి ప్రకోపానికి పంటలు దెబ్బతిని రైతన్నలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పంట నష్టపోయిన వారిని దంతెలబోర ప్రాంతంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పర్యటించారు. ఈ క్రమంలో కిన్నెరసాని గేట్లు ఎత్తివేత వల్ల వరద ఉదృతిలో పాల్వంచ మండలం దంతెలబోర రైతులు చిక్కుకున్నారన్న సమాచారం అందుకున్న ఆయన హుటాహుటిన అక్కడికి చెరుకుని జిల్లా కలెక్టర్, తహసీల్దార్ లకు విషయాన్ని ఫోన్ ద్వారా వివరించారు. స్పందించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో ఆఘమేఘాల మీద యంత్రాంగాన్ని అలెర్ట్ చేశారు. వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి రైతులకు సంబందించిన వివరాలను నాగా సీతారాములు ద్వారా తెలుసుకున్నారు. సుమారు 6 గంటలకు పైగా అక్కడే ఉండి పరిస్థితి సమీక్షించిన సీతారాములు మాట్లాడుతు తనకు సమాచారం తెల్సిన వెంటనే కలెక్టర్, తహసీల్దార్ లకు విషయం చెప్పానని కలెక్టర్ స్పందించిన తీరు అద్భుతమని, అందరిని క్షేమంగా తీసుకు వచ్చే వరకు ఆయన అక్కడే ఉండటం చూస్తే ప్రజల పట్ల ఆయనకున్న భాద్యత స్పష్టం అవుతుందన్నారు.