Praja Telangana
తెలంగాణ

జైనూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత. ఆదివాసి మహిళపై అత్యాచార యత్నం.

జైనూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత. ఆదివాసి మహిళపై అత్యాచార యత్నం.

కొమురంభీం జిల్లా :

జైనూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత. ఆదివాసి మహిళపై అత్యాచార యత్నం, హత్య కు ప్రయత్నించిన ఘటనను నిరసిస్తూ మండల కేంద్రం బంద్ కు పిలుపునిచ్చిన ఆదివాసీ సంఘాలు. భారీగా పోలిస్ బందోబస్తు. అత్యాచార యత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్ ఇల్లు తో పాటు మరో 10 ఇండ్లకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.మీడియానీ అనుమతించని పోలిస్ లు. అడుగడుగున ఆంక్షలు విధించిన పోలిస్ లు. ప్రత్యేక పోలిస్ బలగాల మోహరింపు.

అసలు విషయంలోకి వెళితే

తేదీ 31-08-2024 రోజున దేవుగూడ గ్రామానికి చెందిన 45 సం లు వయసుగల ST గోండు కులమునకు చెందిన మహిళా జైనూర్ కి పనిమీద వచ్చి అక్కడినుండి ఆమె యొక్క తల్లి గారి ఊరు అయిన సోయంగూడ కు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో రాఘవాపూర్ దాటినా తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాహనం తో గుద్ధినాడని తెలిసి, ఆమెను హాస్పిటల్ తరలించగా అక్కడినుండి గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ పంపినారు. తర్వాత తేదీ 01/09/2024 రోజున సిర్పూర్ యూ పోలీస్ స్టేషన్ లో ఆమె యొక్క తమ్ముడు పిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, విచారిస్తున్న క్రమంలో ఆమె నిన్నటి రోజు అనగా తేదీ 2-09-2024 రోజున ఆమెస్పృహలోకి వచ్చినది అని తెలియగా, సిర్పూర్ యు పోలీస్ బాధితురాలు చికిత్స పొందుతున్న దవాఖానకు వెళ్లి ఆమెను విచారించగా , ఆమె తెలిపిన విషయం ఏమనగా తన తల్లి గారింటికి సోయంగూడ కు వెళ్ళడానికి జైనూర్ నందు వేచి చూస్తున్న సమయం లో జైనూర్ సోనుపటేల్ గూడా కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ ముగ్దమ్ అను ముస్లిం వ్యక్తి యొక్క ఆటోలో ఎక్కి తన గ్రామమునకు వెళ్తున్న క్రమం లో రాఘవాపూర్ దాటినా తర్వాత ఆ ఆటో డ్రైవర్ బలత్కారం చేయడానికి ప్రయత్నించగా ఆమె కేకలు వేయడంతో ఆమెను ఒదిలి వేసి నాడు , అమే ఈ విషయం మీద తనమీద కేసు పెడుతుందేమో అని అనుమానించి ఆమెను చంపాలన్న ఉద్దేశ్యం తో కర్రతో కొట్టగా తాను స్పృహ తప్పి పడిపోయింది.
స్పృహ తప్పి పడిపోగా చనిపోయిందని అనుకోని రోడ్డు మీదనే పడవేస్తే ఆక్సిడెంట్ గా అనుకుంటారని భావించి డ్రైవర్ రోడ్డు మీద పడవేసి వెళ్లి పోయినాడు.
*ప్రజా ప్రతినిధులు సహకరించాలి రాజ్ గోండు సేవాసమితి ప్రధాన కార్యదర్శి మాడావి గుణవంత్ రావు *

జిల్లాలోని జైనుర్ మండలంలో ఆదివాసి మహిళపై అత్యాచారానికి నిరసనగా రేపు ఆదివాసి మండలమైన తిర్యాణి మండలంలో సంపూర్ణ బందు చేపట్టడానికి నిర్ణయించడం జరిగిందని దీనికి మండలంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రజా ప్రతినిధులు విద్యాసంస్థలు వ్యాపార సంస్థలు సహకరించాలని రాజ్ గోండు సేవా సమితి ప్రధాన కార్యదర్శి గుణవంత్ రావు తెలిపారు.

*ఆదివాసీ మహిళపై లైంగిక దాడి. బండి ఆరా*

డీజీపీ జితేందర్కు కేంద్రమంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి ఘటనపై ఆరా తీశారు. ఆగస్టు 31న ఘటన జరిగితే ఆలస్యంగా వెలుగులోకి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఘటన నేపథ్యంలో జైనూర్లో ఆదివాసీ వర్గం బంద్కు పిలుపునివ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

Related posts

ఆర్కే 5 గనిలో మరో ప్రమాదం. 24 గంటలు కాకముందే సింగరేణిలో రెండో ప్రమాదం

Beuro Inchange Telangana: Saleem

ఎలక్షన్ కోడ్ దృశ్య ముమ్మరంగా వాహనాల తనిఖీలు*

Beuro Inchange Telangana: Saleem

ఆటో యూనియన్ ఎలక్షన్ లో రెండోసారి విజయం సాధించిన కట్ట రామ్ కుమార్.

Beuro Inchange Telangana: Saleem
Share via