Praja Telangana
తెలంగాణ

సాగర్ 26 గేట్లు ఎత్తివేత?

సాగర్ 26 గేట్లు ఎత్తివేత?

నేటి ప్రజా తెలంగాణ నల్గొండ జిల్లా

నల్లగొండ జిల్లా: సెప్టెంబర్01
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండుకుండ లా తలపిస్తుండడంతో అక్కడి ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

దీంతో సాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 588.90 అడుగులకు చేరింది.

దీనితో సాగర్ డ్యామ్ అధికారులు అప్రమత్తమై సాగర్ 26 క్రస్టుగేట్లు 14 గేట్లు 10 అడుగులమేర,12 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి 5,00,000 క్యూసె క్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

2019 లోసాగర్జలాశయానికి 7,50,000 క్యూసెక్కుల గరిష్ట స్థాయిలో వరద నీరురాగ ,5సంవత్సరాల తరువాత ఇప్పుడు 2024 లో 5,00,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరు తుంది. గంట ,గంటకు వరద ఉదృక్తి పెరుగుతుండడంతో డ్యామ్ అధికారులు అడు గులు పెంచుతూ, సాగర్ జలాశయం నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

సాగర్ ప్రాంత రైతులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సాగర్ దిగువ ప్రాంతంలోని మత్స్యకారు లు చేపల వేటకు వెళ్లకూ డదని రెవెన్యూశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితు లకు అనుగుంగా భద్రత చర్యలు చేపడుతూ స్థానిక అధికారులను 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీచేశారు. అప్రమత్తంగాఉండాలని తెలిపారు. ప్రజలకు ఏలాం టి ఇబ్బందిఉన్న 100కు సమాచారం ఇవ్వాలని జిల్లాఎస్పీ వెల్లడించారు.

Related posts

బెల్లంపల్లి గ్రాట్యూటీ రూ.20లక్షలు వెంటనే చెల్లించాలి*’

కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

Share via