Praja Telangana
తెలంగాణ

కొండ చరియలు విరిగిపడ్డ ఘటన దురదృష్టకరం. పవన్ కళ్యాణ్

కొండ చరియలు విరిగిపడ్డ ఘటన దురదృష్టకరం. పవన్ కళ్యాణ్

విజయవాడలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో నలుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యాను. ఈ దురదృష్టకర ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నాను. గాయపడినవారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా ఎనిమిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అందించే ఏర్పాటు చేసింది. అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికారులకు జనసేన, టిడిపి, బీజేపీ నాయకులు, శ్రేణులు సాయంగా ఉండాలి. ఆహారం, రక్షిత తాగు నీరు, వైద్య సహాయం అందించడంలో తోడ్పాటు ఇవ్వాలి.

Related posts

బైకు దొంగలను పట్టుకున్న మంచిర్యాల పోలీసులు*

*భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ స్మరణలో సాయిభోజన్*

Share via