* హైదరాబాదులో బీసీల హక్కుల సాధనకై జరుగుతున్న అమరణ నిరాహార దీక్ష కు మద్దతుగా బీసీ సంఘాల ఐక్యవేదిక
నేటి ప్రజా తెలంగాణ: మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలో ఐబి చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో బీసీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి చేయడం,స్థానిక సంస్థ ల ఎన్నికలలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం కోసం హిందూ బిసి రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర, బీసీ ఆజాద్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గాడ్గే ఆమరణ నిరాహార దీక్షచేయడం జరుగుతుంది. ఈ రోజుకి 6 రోజు కావడం జరిగింది.కానీ ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బీసీలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తుందని వాపోయారు. కాబట్టి వారి మద్దతుగా మంచిర్యాల జిల్లాలో బీసీ ఐక్య కారుణ్య కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగిందని తెలిపారు.దేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మద్దతుగా తన గళాన్ని బిజెపికి వ్యతిరేకంగా వినిపియడం జరుగుతుందని తెలిపారు.కానీ తెలంగాణలో బీసీల ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వర్గాన్ని కాపాడుకుంటూ బీసీలను అణగదొక్కడానికి,బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే ముందుకు పోవడానికి,బీసీలు అంటేనే లెక్క లేకుండా తన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కావున కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముందుకు పోతే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తామని,ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగిందని తెలిపారు. నిరాహార దీక్ష చేస్తున్న బీసీ నాయకులకు ఏమైనా జరగడానికి జరుగుతే ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా హెచ్చరించడం జరిగిందని తెలిపారు.అన్ని రాజకీయ పార్టీలు లో ఉన్నా బీసీ నాయకులు బీసీ ఉద్యమానికి అండదండగా ఉండాల్సిందిగా కోరడం జరిగిందిని తెలిపారు.ఇప్పటికైనా రేవంత్ రెడ్డి,కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం స్థానిక సంస్థలు ఎన్నికలలో రిజర్వేషన్ కేటాయించాలని,తెలంగాణలో సమగ్ర కుల గణన చేసి బీసీల శాతాన్ని లెక్కించాలనీ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్,జాతీయ బీసీ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్,సామాజిక న్యాయవేదిక జిల్లా అధ్యక్షులు రంగు రాజేశం, రిటైర్డ్ ఎంఈఓ బీసీ నాయకులు శ్రీరాముల కొండయ్య,బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నస్పూరి అఖిల్,బీసీ ఐక్యవేదిక యవజన జిల్లా అధ్యక్షుడు పెద్దల చంద్రకాంత్,బీసీ సంక్షేమ సంఘం యువజన నాయకులు పిట్టల రవి,బీసీ నాయకులు శాఖ పూరి భీమ్ సేన్,రామగిరి రాజన్న చారి, పంపరి వేణుగోపాల్,ఎండి లతీఫ్,చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్ తదితరులు పాల్గొన్నారు.