Praja Telangana
తెలంగాణ

నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో సహా ముగ్గురు వ్యక్తులు అరెస్ట్.*

*నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో సహా ముగ్గురు వ్యక్తులు అరెస్ట్.*

*గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో గతంలో కేసు నమోదు.*
*జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ.*

నేటి ప్రజా తెలంగాణ గంభీరావుపేట

గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేసి వాటిని అదే గ్రామానికి చెందిన అడవి జంతువులను వేటాడే వారికి అమ్ముతున్నాడన్నా నమ్మదగిన సమాచారం రాగా గంభీరావుపేట ఎస్.ఐ ఈరోజు తన సిబ్బందిని తీసుకొని గజసింగవరం గ్రామంలోని రాయలింగు శంకర్ ఇంటికి వెళ్ళగా అక్కడ రాయలింగు శంకర్ వివిధ పనిముట్ల ఉపయోగించి నాటు తుపాకులు తయారు చేస్తుండగా పట్టుకొని, అతని వద్ద రెండు తుపాకి బ్యారెల్, తుపాకుల తయారు చేయడానికి వాడే రంపము, సుత్తి, కత్తి, ఆకు రాయి, డ్రిల్లింగ్ మిషన్ ,దూడ మిషన్, ఎయిర్ బుల్లోజర్ స్వాధీనం చేసుకొని నిందుతున్నీ పై కేసు నమోదు చేసి ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కేసు తదుపరి దర్యాప్తు ప్రారంభించగా దర్యాప్తులో భాగంగా గజసింగవారం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ వద్ద నాటు తుపాకులు కొనుగోలు చేసి జంతువుల వేటకు ఉపయోగిస్తున్న రాయలింగు చంద్రమౌళి, శాతవేణిహరీష్ లోగిడి గంగయ్య లను అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు తుపాకులు నాలుగు ట్రిగర్ భాగాలు స్వాధీనం చేసుకొవడం జరిగిందని పై నలుగురు నిందుతులను ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగిందని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నింధుతులను అరెస్ట్ చేసిన ఎల్లారెడ్డిపేట్ సి.ఐ శ్రీనివాస్,గంభీరావుపేట ఎస్.ఐ రామ్మోహన్,సిబ్బంది ని అభినందించిన జిల్లా ఎస్పీ
ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్, ఎస్ .ఐ లు రామ్మోహన్,రమాకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.

*నింధితుల వివరాలు.*
*1. రాయలింగు శంకర్, S/o. నర్సయ్య, age 50y, R/o. గజసింగవరం v/o. గంభీరావుపేట.*
*2. రాయలింగం చంద్రమౌళి, S/o. అంజయ్య, age 40 y, , R/o. గజసింగవరం v/o. గంభీరావుపేట.*
*3.శత్రవేణి హరీష్, S/o. నారాయణ, age 27 y, R/o. గజసింగవరం v/o. గంభీరావుపేట.*
*4.లోకిడ్ గంగయ్య, S/o. నర్సయ్య, age 45 y,R/o. గజసింగవరం v/o. గంభీరావుపేట.*

Related posts

నేతకాని హక్కుల పోరాట సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గా దుగుట వెంకటేష్*

*బీపీ మండల్ సిఫారసులు అమలుపై జాతీయ పార్టీల వైఖరి స్పష్టం చేయాలని తెలంగాణ బీసీ జాగృతి జిల్లా అధ్యక్షులు నరేడ్ల శ్రీనివాస్ డిమాండ్*

బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి క్వార్టర్ ని ప్రారంభించిన హైకోర్టు జడ్జి

Share via