*వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విదంగా ఉండాలి…*
— రామగుండము కమీషనరేట్ పరిదిలో ఆనధికారిక వాహనాలకు
— పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.
రామగుండం,ఆగస్టు29:
అర్హత లేని వాహనాలపై ఉండే ప్రెస్,ఆర్మీ,పోలీస్,ఇతర శాఖల స్టిక్కర్ల ఉంటే తొలగించాలని,వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విదంగా ఉండాలని,వాహనాలకు బ్లాక్ ఫిలిమ్‌లు తొలగించాలని,వాహనాలకు సంబంధించి సరైన ధ్రువ పత్రా లు కలిగి ఉండాలని,ద్విచక్రవాహనదారులు కంపని నుండి వచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫై చేస్తే వాటిని,సైరన్ లు సెప్టెంబర్ 02వ తేది లోపు తొలగించాలని వాహనదారులకు ముందస్తూ సమాచారం ఇవ్వడం జరుగుతుందని,సెప్టెంబర్ 03వ తేది నుండి రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిదిలో ప్రతి రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబందనలకు విరుద్దమగా,ట్రాఫిక్ నిబందనలను ఉల్లఘించిన వారికీ జరిమానాలు విదిస్తూ వాహనాలు సిజ్ చేయడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్,ఐజీ గారు ఒక ప్రకటన లో తెలిపారు.ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ కొన్నిచోట్ల కొంతమంది పోలీస్,ఆర్మీ,ఇతర డిపార్టుమెంట్ స్టిక్కర్,మీడియా సంస్థల్లో పనిచేయకున్నా ప్రెస్ అని యధేచ్ఛగా తమ వాహనాలపై వేసుకుని తిరుగుతున్నారని,వాటిని వెంటనే తొలగించాలని లేనియెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.వాహనాలకు నెంబర్ ప్లేట్లను తమకు ఇష్టమొచ్చినట్లుగా,ఇతరులను ఆకర్షించేటట్లుగా మార్చేస్తున్నారు.ఉదాహరణకు 8055 నెంబరును (బాస్) లాగా మార్చేస్తున్నారు.వాహనాల నెంబర్లు ట్యాంపరింగ్ చేయడం,నెంబరు ప్లేటు లేకుండా,నెంబర్ కనిపించడకుండా నెంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటించడం,నెంబర్ కనిపించడకుండా బెండ్ చేయడం,రకరకాల డిజైన్లతో నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేయడం నేరం.వాస్తవానికి రోడ్డు ప్రమాదాల్లో గానీ,ఇతరత్రా కేసులు చేధించడంలో వాహనాల నెంబర్లే ప్రధాన పాత్ర పోషిస్తాయి.అలాంటిది వాహనాల నెంబర్లు కనబడకుండా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.వాహనాల నెంబర్ ప్లేట్లు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పని సరిగా ఉండాలి.కొంతమంది యువత ద్విచక్రవాహనల సైలెన్సర్ మాడిఫై చేసి పెద్ద శబ్దాలతో సౌండ్-పొల్యూషన్ చేస్తూ,సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.వివిధ రకాల ప్రైవేటు వాహనాల కు ఎలాంటి అనుమతులు లేకుండా అత్యవసర సేవల సందర్భంగా వినియోగించే సైరన్ లను ఏర్పాటు చేసినారు.అట్టి వాహనదారులు వారం లోపు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని,సైరన్లను తొలగించని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కొంతమంది వాహనాల అద్దాలకు పూర్తిగా కనిపించకుండా బ్లాక్ ఫిలిమ్‌లు వేసుకొని తిరగడం చేస్తున్నారు.వెంటనే తొలగించాలని తెలిపారు.వాహనాల ముందు విండోకు 70 శాతం వెలుతురు వచ్చే విధంగా,వెనుక విండోకు 50 శాతానికి తక్కువ కాకుండా వెలుతురు వచ్చే విధంగా తయారు చేయాలని నిబంధనలున్నాయన్నారు.ప్రతిఒక్క వాహనాలకు సంబంధించి సరైన ధ్రువ పత్రా లు లేకుండా,తప్పుడు నెంబర్ ప్లేట్లు పెట్టుకొని వాహనాలు నడిపడం,తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో రిజిస్ట్రేషన్ చేయకుండ వాహనాలు నడపడం చేస్తున్నారు అట్టి వారి వాహనాలు సిజ్ చేయడం జరుగుతుంది.పైన తెలిపిన ఆదేశాలు,సూచనలు వాహనదారులు అందరు పాటించి నిబందలకు విరుద్ధంగా ఉన్న వారి వాహనాలను నిబందనల ప్రకారం సెప్టెంబర్ 02వ తేది లోపు మార్చుకోవాలని సూచించారు.సెప్టెంబర్ 03 తేది నుండి ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి తెలిపరు.