మంచిర్యాల: 2 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు హాస్పిటల్ ప్రాంతాలలో రాత్రి సమయంలో సీఐ.బన్సీలాల్, సిబ్బందితో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సీఐ మాట్లాడుతూ. తనిఖీల్లో భాగంగా 2ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామన్నారు. ఆసుపత్రిలో మద్యం సేవించిన 5 గురు వ్యక్తులను గుర్తించి వారిని హస్పిటల్ బయటకు పంపించామన్నారు. మాత శిశు ఆసుపత్రిలోకి మద్యం, మత్తు పదార్థాలు సేవించిలోనికి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాచ్మెన్ కు తగు సూచనలు చేశారు.తాగి వచ్చిన వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు