Praja Telangana
తెలంగాణ

బీసీ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామస్థాయికి తీసుకుపోవాలని వక్తల పిలుపు.

*బీసీ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామస్థాయికి తీసుకుపోవాలని వక్తల పిలుపు…* మంచిర్యాల జిల్లాలో మంగళవారం బిసి భవన్ లో జరిగిన మంచిర్యాల జిల్లా ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో మంచిర్యాల జిల్లాలోని బీసీ సంఘం నాయకులు, మండల నాయకులు బిసి సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.ఐక్య కార్యచరణ కమిటీ సమావేశంలో బీసీ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని తీవ్రతాలను చేసి, గ్రామస్థాయికి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డీక్లరేషన్ పేరిట బీసీ ప్రజలకు అనేక రకమైన హామీలు ఇవ్వడం జరిగింది హామీలలో ముఖ్యమైనది బీసీ జన గణనం ఆరు నెలల్లో చేస్తామని,స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42% కేటాయించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం జరుగుతుందని ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది.కానీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ తాను బీసీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో దాటవేసే ధోరణి అవలంబిస్తుందని ఈ సమావేశంలో వక్తలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ గతంలో జరిగిన ఎన్నికలలో బీసీ ప్రజలకు దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి ఈరోజు ఆ మాటను నిలబెట్టుకుండా బీసీ ప్రజలను వంచిందని ఈ సమావేశంలో నాయకులు అన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా కులగననకు చేయడానికి ముందుకు రావాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. కుల గణన చేయకుండా స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ తన డిక్లరేషన్ లో ప్రకటించిన ప్రకారము 42 శాతం బీసీ ప్రజలకు కేటాయించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో బీసీ ఐక్య కార్యారణ కమిటీ తరఫున బీసీ తీర్మానాలను ప్రకటించడం జరిగింది.
1) బీసీ ఐక్య కార్యకరణ కమిటీ తరఫున కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష.
2) మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గ ఎమ్మెల్యేలకు మరియు ఎంపీకి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున వినతి పత్రాలు ఇవ్వాలి.
3) బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకొని పోవాలి.
4) దేశవ్యాప్తంగా బీసీ కుల జనగణను చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
5) కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డెకరేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి.
6) రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయికి నిర్మించాలి.
ఈ సమావేశంలో బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వడ్డేపల్లి మనోహర్, గుమ్ముల శ్రీనివాస్, నరెడ్ల శ్రీనివాస్,కర్రి లచ్చన్న, రాజేశం గౌడ్, బుద్ధి చంద్రమౌళి,వైద్య భాస్కర్,చంద్రగిరి చంద్రమౌళి, సాగపురి భీమ్సేన్, గుంటుక సోమన్న, పాయిరాల రాములు, మొగిలి లక్ష్మణ్, జైపూర్ మండలనాయకులు మల్లేష్,గణేష్ వెంకటేష్,బండ సతీష్,రామగిరి రాజన్న చారి,అంకం సతీష్, నేన్నెల మండల నాయకులు దండే భూమన్న, పంపరి వేణుగోపాల్, యువజన నాయకుడు చంద్రకాంత్, సలీం తదితరులు పాల్గొన్నారు.

Related posts

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి గడచిన నాలుగు నెలలుగా ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త హామీలతో ప్రజలను మభ్య పెడుతుంది.

Beuro Inchange Telangana: Saleem

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి’ ప్రతి

Share via