Praja Telangana
తెలంగాణ

ఆగస్ట్ 21 న భారత్ బంద్ ని విజయవంతం చేయండి*

*ఆగస్ట్ 21 న భారత్ బంద్ ని విజయవంతం చేయండి*

*ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు*

మంచిర్యాల;
తేదీ:20 ఆగస్ట్.

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆగస్టు 1న ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో
*ఆగస్టు 21న భారత్ బంద్ కు పలువురు నాయకులు జిల్లా బందుకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 1న భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగస్టు 1న రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో ఐదుగురుతో కూడిన ధర్మాసనం ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ సాధ్యం కాదని ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పించిందని గుర్తు చేశారు. ఇది ముమ్మాటికి సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తాలేమని ఇది నరేంద్ర మోడీ తీర్పు గాని భావిస్తున్నామని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా భారత్ బంద్ ను స్వచ్ఛందంగా ఆర్టీసీ, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బందు కి సహకరించాలని* మా న్యాయమైన రాజ్యాంగ పరిరక్షణ కోసం సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో
నాయకులు* జూపాక సుధీర్,*
పొట్ట మధుకర్,*
ఆసాది పురుషోత్తం,*
పాల్టెపు శంకరయ్య,*
కుంభాల రాజేష్,*
నక్క శ్రీనివాస్,*
మండల రవికుమార్,*
దేవరపల్లి మధుబాబు,*
సొల్లు శ్రీనివాస్,*
నాగమల్ల ప్రకాష్,*
నారమళ్ళ పురుషోత్తం* తదితరులు పాల్గొన్నారు…

Related posts

జింక పిల్లను కాపాడిన సెక్షన్ ఆఫీసర్.

గులాబీ మయమైన చెన్నూర్..జనసంద్రమైన చెన్నూరు ప్రజా ఆశీర్వాద సభ.

ఘనంగా సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం*

Share via