బెల్లంపల్లి: రోడ్ల సమస్యపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
బెల్లంపల్లి నియోజకవర్గంలోని రోడ్లకు సంబంధించిన పనులపై పంచాయితీ రాజ్ శాఖ డి ఈ,ఈ, ఈ, అధికారులతో, 5మండలాల పంచాయతీరాజ్ ఏ. ఈ లతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యంలో ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయని తెలిపారు. బెల్లంపల్లి లో ప్రజలకు ఎలాంటి కష్టం కలవకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేయిస్తానని వారు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు ఎక్కడ ఇబ్బంది కలిగిన తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు