స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అధికారి ఆకస్మిక తనిఖీ.
నేటి ప్రజా తెలంగాణ – జైపూర్
జైపూర్ మండలంలోని ముదిగుంట, మిట్టపల్లి, కాన్కూర్ ఈ రోజున తేది 07-08-2024 స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలను జిల్లా పంచాయతీ అధికారి శ్రీ డి.వెంకటేశ్వర్ రావు ఆకస్మికంగా సందర్శించటం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లచే క్రమం తప్పకుండా ప్రతీరోజు ఇంటిటా చెత్తసేకరణ చేయించాలని, రోడ్డు మీద ప్లాస్టిక్ పడవేయకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని, ప్రతీ ఇంట్లో నీరు నిల్వ ఉంచకుండా డ్రై డే నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించటం జరిగింది.
ఈ తనిఖీలు పాల్గొన్న అధికారులు శ్రీపతి బాపురావు మండల పంచాయతీ అధికారి జైపూర్, పి.సురేష్ పంచాయతీ కార్యదర్శి ముదిగుంట, బి.సురేందర్ పంచాయతీ కార్యదర్శి కాన్కూర్, జి.ప్రవీణ్ పంచాయతీ కార్యదర్శి మిట్టపల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.