Praja Telangana
తెలంగాణ

*హైదరబాద్ తరిలో వెళ్లిన జిల్లా పద్మశాలి సంఘం నాయకులు

*హైదరబాద్ తరిలో వెళ్లిన జిల్లా పద్మశాలి సంఘం నాయకులు.*

రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్ చేసిన ప్రముఖ సంఘ సేవకులు పద్మశాలీయుల అభివృద్ధికి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న, బూర్ల మల్లేశం హైదరాబాదులో వనస్థలిపురంలోని కార్నాటీ గార్డెన్స్ నుండి ఎల్.బి నగర్ వరకు సుమారు 400 మంది తో ర్యాలీగా వచ్చి లక్ష్మి పద్మశాలి టెక్స్టైల్స్ కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన రాష్ట్ర ఎన్నికల అధికారులకు
బుధవారం రాత్రి నామినేషన్ పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిలగాని సుదర్శన్, ఉపాధ్యక్షులు చెలమల్ల అంజయ్య, సలహాదారులు గుండేటి యోగేశ్వర్, జిల్లా సంఘం వ్యవ స్థాపకులు బొద్దున బాపూజీ పాల్గొని నామినేషన్ బలపరిచి శుభాకాంక్షలు తెలిపారు.

పద్మశాలీయులు బూర్ల మల్లేశం ను అత్యధిక మెజారిటీతో జిల్లా గెలిపించాలని పద్మశాలీయులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు,వివిధ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Related posts

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీపీ

నిద్రిస్తున్న మహిళ మెడ నుండి బంగారం పుస్తెల తాడును దొంగలించిన దొంగ అరెస్ట్*

వినాయక చవితి పురస్కరించుకొని గణేష్ మండపాల ఏర్పాటు కు అనుమతి తప్పని సరి *ఏసిపి వాసాల సతీష్

Share via