బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం కల్పించాలి’
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ. పట్టణానికి ఎంతో పెద్ద చరిత్ర ఉందన్నారు. ఇల్లందులో బొగ్గు పుట్టిన తర్వాతే బెల్లంపల్లిలో పుట్టిందన్నారు. ఏరియా ఆసుపత్రిలో సరైన వైద్యులను నియమించి ఆసుపత్రికి పూర్వ వైభవం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే వినోద్ ఆసుపత్రిని రక్షించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి మూసివేత నిర్ణయాన్ని యాజమాన్యం విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. ఆస్పత్రి ఎదుట రిలే నిరాహార దీక్షను ఆయన సందర్శించి ఏరియా పరిరక్షణ జేఏసీ నాయకులకు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ. ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయం కల్పించి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు, రిటైర్డ్ కార్మికులకు వైద్య సహాయం కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి నాయకులు టి మణి రామ్ సింగ్ , . ఎం. సిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు