* మిస్సింగ్,అసహజ మరణాల కేసులపై ప్రత్యేక దృష్టి
* డయల్ 100 ల పై ప్రత్యేక చర్యలు
మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్
నేటి ప్రజా తెలంగాణ: మంచిర్యాల
మంచిర్యాల డిసిపి కార్యాలయంలో ఏసిపి,సిఐ, యస్ఐ లతో జరిగిన నేర సమీక్ష సమావేశము నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా డిసిపి మాట్లాడుతూ అసహజ మరణాలు,మిస్సింగ్ కేసులు త్వరితగతినపరిష్కరించాలని తెలిపారు. అలాగే డయల్ 100 కాల్స్ పట్ల సత్వర స్పందన కలిగి ఉండాలని సూచించారు.ఎవరైనా తప్పి పోయినట్లు ఫిర్యాదు అందినచో ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేసి తప్పి పోయిన వ్యక్తి సంబంధించిన వివరాలతో కూడిన ఫోటో అన్ని పోలీస్ స్టేషన్ల కు పంపించి సంబంధిత వెబ్ సైట్ లో పొందు పరచాలని ఆదేశించారు.అదే విధంగా అసహజ మరణాలు దర్యాప్తు చేయునపుడు మృతుని మరణానికి గల కారణాలను లోతుగా పరిశోధించి,సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తగు విధంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.