రేషన్ డీలర్ల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేస్తా – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు Y.V.B.రాజేంద్రప్రసాద్.
నేటి ప్రజా తెలంగాణ – ఉయ్యూరు
రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాగిత కొండ ఆధ్వర్యంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమంచిలి వెంకట బాబు రాజేంద్రప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసి రేషన్ డీలర్ల సంఘం తరపున పలు సమస్యలు వివరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన రేషన్ డీలర్లు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు ఇచ్చిన మెమొరండంలో.
రాష్ట్రంలో ఉన్న డీలర్లు అందరికీ వయసు తో సంబంధం లేకుండా కమీషన్ తో కూడిన వేతనం ఇవ్వాలని..
గత ప్రభుత్వం లో డీలర్లు వద్ద సేకరించిన గోనె సంచులు డబ్బులు ఇప్పించాలని..
తూనికలు కొలతల శాఖ వారు కాటాలకు వేసే శిఖా రుసుము తీసివేయాలని మరియు గోడౌన్ నుండి పంపిణీ చేసే సరుకులు అరువు మీద ఇవ్వాలని మెమోరండం ఇవ్వడం జరిగింది.
రేషన్ డీలర్ల సమస్యలపై రాజేంద్రప్రసాద్ గారి స్పందిస్తూ…మీ సమస్యలపై నాకు పూర్తిగా అవగాహన ఉంది అని, తప్పకుండా మీ సమస్యలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి కి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు రెడ్డి రమణ, వీరప్ప, ఎం ఏసుబాబు, రాజులపాటి ఫణి, దేవినేని శ్రీదేవి, , కొలుసు సుబ్బారావు,ప్రసాద్, రవి , ప్రమీల, మోహనరావు, ప్రసాద్, బాబ్జీ, కళ్యాణ్,పాప, వెంకటేశ్వరరావు, ధనుంజయ, అభిలాష్ ,తదితరులు పాల్గొని అభినందనలు తెలియ చేసిన వారిలో ఉన్నారు.