కొత్తగా నియమితులైన ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ని సత్కరించిన రామ్ లక్ష్మణ్.
నేటి ప్రజా తెలంగాణ – అన్నపూర్ణ కాలనీ
ఎన్ టి పి సి అన్నపూర్ణ కాలనీలో గత 40 సంవత్సరాలుగా హెయిర్ స్టైల్ రంగంలో తమ సేవలు అందిస్తున్న హైదరాబాద్ సెలూన్స్ నిర్వాహకులు రామ్ లక్ష్మణ్ ఈమధ్య కొత్తగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐతే ప్రకాష్ రెడ్డిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంలో రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ మృదుస్వభావి, సౌమ్యుడు అయినటువంటి ఐతే ప్రకాష్ రెడ్డి కి ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ రావడం చాలా శుభ పరిణామం అని, రాష్ట్రస్థాయికి ఎదగడానికి చాలా కష్టపడ్డారని, తన సేవలో రాష్ట్రం తో పాటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి కూడా ఎల్లవేళలా ఉంటాయని, రామగుండం పేరు రాష్ట్రస్థాయిలో వినబడుతుంది అని ఈ సందర్భంలో తెలియజేశారు.