Praja Telangana
తెలంగాణ

సింగరేణిలో లాభాల వాటా వెంటనే చెల్లించాలి మండే శ్రీనివాస్ సి ఐ టి యు.

సింగరేణిలో లాభాల వాటా వెంటనే చెల్లించాలి మండే శ్రీనివాస్ సి ఐ టి యు. ‌. కోల్ బెల్ట్ ఏరియా ప్రతినిధి పార్వతి రాజిరెడ్డి జూలై 26 గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన ఉత్పత్తి నుండి లాభాల వాటా వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని సిఐటియు నాయకులు మండే శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు ప్రధానంగా గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 100% ఉత్పత్తి సాధించిందని ఆర్థిక సంవత్సరం గడిచిపోయి నాలుగు నెలలైనా ఇప్పటివరకు సాధించిన లాభాలను యాజమాన్యం చెప్పడం లేదని వాస్తవ లాభాలను ప్రకటించి గత సంవత్సరం కంటే వాటా శాతాన్ని పెంచివ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు గత ప్రభుత్వం సింగరేణి సంస్థను ఆర్థికపరమైన నష్టానికి గురిచేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దసరా ముందు లాభాల వాటాను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు ఈ విషయాన్ని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికులకు మేలు చేసే విధంగా 35 శాతం వాటా కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు విద్యా సంవత్సరం ప్రారంభమై కార్మిక కుటుంబాలు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో లాభాల వాటాను చెల్లించడం వల్ల కార్మిక కుటుంబాలకు కొంత వెసులుబాటు కలుగుతుందని అన్నారు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రస్తుత ప్రభుత్వం కార్మిక కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని లాభాల వాటా చెల్లించటానికి చొరవ చూపాలని తెలిపారు ప్రస్తుతం కార్మిక కుటుంబాలు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో సతమతమవుతున్నందున వెంటనే లాభాల వాటా చెల్లింపుకు ప్రభుత్వం చొరవ చూపి చెల్లింపులు తొందరగా జరిగేటట్టు చర్యలు చేపట్టాలని అన్నారు ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతునిస్తున్న సిపిఐ అనుబంధ ఏఐటియుసి గుర్తింపు సంఘం గా అధికార పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టియుసి ప్రాతినిధ్య సంఘంగా కొనసాగుతున్నందున కార్మిక వర్గానికి లాభాల వాటా చెల్లింపుకు కృషి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కష్టకాలంలో కార్మిక వర్గానికి లాభాల వాటా చెల్లించటానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి కార్మిక వర్గానికి మేలు చేయాలని ఆయన కోరారు గత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు తమ కృషి వల్లే లాభాల వాటా చెల్లిస్తున్నారని ప్రకటనలు గుప్పించి కార్మిక వర్గానికి నష్టం కలిగించాయని అలా కాకుండా ప్రస్తుత ప్రభుత్వం వాటి అనుబంధ కార్మిక సంఘాలు కార్మికులకు లాభాల వాటా వెంటనే చెల్లించేటట్టు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు

Related posts

రేషన్ డీలర్ల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేస్తా – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు Y.V.B.రాజేంద్రప్రసాద్.

మే 1న తెలంగాణ లో 10th పరీక్ష ఫలితాలు*

మైసిగండి హుండీ ఆదాయం 15.40 లక్షలు ఆమనగల్లు,

Share via