Praja Telangana
తెలంగాణ

సాడి స్వాతంత్ర రెడ్డి జ్ఞాపకార్ధం సాయి భోజన్

సాడి స్వాతంత్ర రెడ్డి జ్ఞాపకార్ధం సాయి భోజన్ . – గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ*

బెల్లంపల్లి: ప్రముఖ పాల వ్యాపారవేత్త, బెల్లంపల్లి కరీంనగర్ డెయిరీ సి అండ్ ఎఫ్ మరియు భూద కలాన్ షిరిడి సాయిబాబా ఆలయ విగ్రహ దాత, సేవా తత్పరుడు, తమ ట్రస్టు నిత్య దాత సాడి స్వాతంత్ర రెడ్డి చిన్న కర్మ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు వ్యవస్థాపకుల ఆర్థిక సహకారంతో గర్భిణులకు బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
అన్నదానంలో భాగస్వామ్యమవుదాం
ట్రస్ట్ ద్వారా “ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం” అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని,మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ,సేవకులు ఈగురపు భాస్కర్, కాడపాక మహేందర్,పోతురాజుల తిరుపతి, వేల్పుల రాజేందర్, ఎస్.కె పర్వీన్ డాక్టర్ లు ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు ,తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.

Related posts

నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్

బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని కాసిపేట మరియు దేవాపూర్ పోలీస్ స్టేషన్ లను సందర్శించిన మంచిర్యాల డిసిపి*

బెల్లంపల్లి పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎమ్మెల్యే వినోద్

Share via