గురుపౌర్ణమి సందర్భంగా సాయిభోజన్, దుప్పట్ల పంపిణీ
-కుర్రేఘాడ్ గ్రామంలో గిరిజనులకు అన్నదానం
వర్షాకాలం, చలికాలం నేపథ్యంలో దుప్పట్ల పంపిణీబాయిజమ్మ సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కార్యక్రమాలు
బెల్లంపల్లి: గురు పౌర్ణమిని పురస్కరించుకుని బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం కుర్రెఘాఢ్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గిరిజనులకు, అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజనులు అన్నార్తులు సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.గిరిజనులకు దుప్పట్లు పంపిణీ
కాసిపేట మండలంలోని మారుమూల గిరిజన గ్రామం అయిన కుర్రేఘాట్ గ్రామంలో ఉన్న గిరిజనులకు ప్రస్తుత వర్షాకాలం మరియు రానున్న చలికాలం నేపథ్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఈ మేరకు చొరవ తీసుకొని దాతల సహకారంతో దుప్పట్లు కొనుగోలు చేసి ఇక్కడి గిరిజనులకు పంచిపెట్టారు. తమ అవసరాన్ని గుర్తించి చక్కని దుప్పట్లు పంచిపెట్టిన ట్రస్ట్ వారికి ఈ సందర్భంగా అక్కడి గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు.సాయినాథుని ఆశీర్వచన.. బాయిజమ్మ ఆలోచన. ట్రస్ట్ వారి ఆచరణ.
ప్రపంచానికి ప్రేమ తత్వాన్ని, సేవా మార్గాన్ని బోధించిన సాయినాధుని ఆశీర్వాదంతో.. మరియు ఆకలితో అలమటించే సాటివారి కడుపు నింపాలనే బాయిజమ్మ ఆలోచనతో వారి మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమాలను ఆచరిస్తున్నట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. వివిధ పండుగలను మరియు ప్రత్యేక దినోత్సవాలను పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిత్య అన్నదానం తో పాటు వారం వారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మహా అన్నదానం మరియు పలు సందర్భాలలో గిరిజన మరియు కడు పేదరిక గ్రామాలలో అన్నదానం, దుప్పట్ల పంపిణి, బట్టల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.అన్నదానం చేద్దాం. కలిసిరండి
ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని,మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ డి మధుకర్, నల్ల అంబిక శ్రీనివాస్ , గోనె మంజుల శ్రీనివాస్ ,సేవకులు కోలా గోపాల్, రోహిత్, ఎండి యూసుఫ్ , కాడపాక మహేందర్, పోతురాజుల తిరుపతి, ఆరుట్ల మౌనిక, జక్కుల పోషన్న, డాక్టర్ పేరం రమేష్ గ్రామ పెద్దలు. మీడియా సిబ్బంది, దాతలు ,తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.