బెల్లంపల్లిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.
బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తి లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీస్ అధికారులు. వారు మాట్లాడుతూ, సిపి రామగుండం డీసీపీ మంచిర్యాల ఏసీబీ బెల్లంపల్లి ఆదేశాలనుసారం బెల్లంపల్లి కన్నాల బస్తిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉంటున్నారా లేదా, అపరిచిత వ్యక్తులకు ఇక్కడ ఎవరైనా అనే కోణంలో విచారిస్తూ, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు గుర్తింపు కార్డు పరిశీలించడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా, ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడిన, భూమికి సంబంధించిన గొడవలకు పాల్గొన్న లేదా అమాయకులను మోసం చేసిన వారిపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ఆ వ్యక్తులపై రౌడీ, షీట్ తెరవబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య ,రూరల్ సీఐ అబ్దుల్, అబ్జాలోద్దీన్ ఎస్ఐ లు, స్పెషల్ పార్టీ ఫోర్స్ పాల్గొనడం జరిగింది.