మంచిర్యాల ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ ని సందర్శించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్
మంచిర్యాల జిల్లా జఫర్ నగర్ ఏరియాలో ఉన్న ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ ని సందర్శించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా దృష్టికి కొన్ని విషయాలు వచ్చాయి, హాస్టల్లో మెనూ ప్రకారం పిల్లలకు భోజనం అందించడం లేదని త్రాగునీరు సౌకర్యం లేదు ఆహార వ్యవస్థ మరీ దారుణంగా ఉంది హాస్టల్ గదులలో అపరిశుభ్రత బాత్రూములు సక్రమంగా లేక మురికికుంటలను తలపిస్తున్నాయి పరిపాలన అధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న హాస్టల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే జిల్లాలోని పలు మండలాలలో ఉన్న హాస్టల్లో పరిస్థితి ఇంకే విధంగా ఉంటుంది ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సూపరిండెంట్ వివరించామని తెలియజేశారు . తక్షణమే కలెక్టర్ స్పందించి హాస్టల్లను సందర్శించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇకపై ఇలాంటి పునరావతం అయితే ఎస్సీ మార్చ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలుపుతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సి మొర్చ జిల్లా కార్యదర్శి నాగుల రాజన్న కల్లేపల్లి నవీన్ ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కామెర అర్జున్ కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు దేవరకొండ వెంకన్న బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డి మల్ల అశోక్ ఎస్సీ మోర్చా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కనకం శ్రీనివాస్ జనగామ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు