Praja Telangana
తెలంగాణ

ఝాన్సీ లక్ష్మీబాయి స్మరణలో సాయి భోజన్

ఝాన్సీ లక్ష్మీబాయి స్మరణలో సాయి భోజన్

గర్భిణులు, బాలింతలు, రోగులకు అన్నదానం
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం
బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ

నేటి ప్రజా తెలంగాణ
బెల్లంపల్లి: భారత స్వాతంత్ర పోరాట యోధురాలు త్యాగశీలి వీరనారి భారతీయ ముద్దుబిడ్డ మని కర్ణిక ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు మరియు నీటి దాత కాడపాక మహేందర్ సహకారంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దేశభక్తితో ఝాన్సీ లక్ష్మీబాయి స్మరణ పేరిట అన్నదానం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతీ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతీ అన్నార్తికి అన్నం పెట్టే మహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు.
అన్నదానంతో అన్నార్తులను తృప్తిపరుద్దాం
ట్రస్ట్ ద్వారా “ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం” అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్,సభ్యులు, జే చంద్రకళ, సేవకులు ఈగురపు భాస్కర్, కాడపాక మహేందర్, పోతురాజుల తిరుపతి, మెరుగు ఇందు , డాక్టర్ లు ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు ,తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.

Related posts

కాంగ్రెసులో చేరిన కౌన్సిలర్లు సమాధానం చెప్పాలి: చిన్నయ్య

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ

కుశ్నపెల్లి మనోహర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టి పి సి సి రాష్ట్ర జాయింట్ కన్వీనర్ నాతరిస్వామి

Share via