* వృద్ధురాలిని ఇంటి నుండి బయటకి పంపిన కొడుకులకు కౌన్సిలింగ్
* వృద్ధురాలిని తిరిగి కొడుకుల వద్దకు చేర్చిన సిఐ బన్సీలాల్
నేటి ప్రజా తెలంగాణ: మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రం చింతపండువాడ కు చెందిన సామంతుల గోపమ్మ, వయస్సు 78 సం,,లు అను వృద్దురాలిని అమానుషంగా కొడుకులు,కోడళ్ళు ఇంటి నుండి బయటికి పంపగా ఎటు వెళ్ళాలో తెలియని ఆ వృద్దురాలు మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ బన్సిలాలను ఆశ్రయించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సామంతుల గోపమ్మ కు 5 గురు కొడుకులు,ఒక కుమార్తెలు ఉన్నారు.వృద్దురాలి భర్త గత కొన్ని సంవంత్సరాల క్రితమే మరణించడం జరిగిందని తెలిపారు.ఆమె కొడుకులకు తన భూమిని సమానంగా పంచి ఇవ్వడం జరిగిందని తెలిపారు.అయినను కొడుకులు తన సంరక్షణ ను పట్టించుకోకుండా వేసవి కాలం అనికూడా చూడకుండా ఆమెను ఇంటి నుండి పంపి వేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆమె కొడుకులను,కోడళ్ళను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి అలా ప్రవర్తిస్తే కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది అని హెచ్చరించగా వారు వాళ్ళ తల్లిని తమ వెంట తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.అంతేకాకుండా ఆమె పరిస్థితిని చూసి సహృదయంతో వృద్దురాలికి 25 కేజీ ల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగినదని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిఐ బన్సీలాల్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.