*ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా సాయి భోజన్*- . *గర్భిణులకు, బాలింతలకు, రోగులకు అన్నదానము బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో కార్యక్రమం- బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ*
. బెల్లంపల్లి: ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు నీటి దాత కాడపాక మహేందర్ సహకారాలతో గర్భిణులకు బాలింతలకు, రోగులకు, అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా.
బాయిజమ్మ సాయి సేవ ట్రస్టు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ముందుకు సాగుతుందని వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. సాటి మనిషికి సహాయపడటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మన సంస్కృతిలో భాగమని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్నవాడికి వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు అందించడంతోపాటు నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా తమ ట్రస్టు ఆధ్వర్యంలో చేస్తున్నామని ఈ సందర్భంగా వివరించారు.
అన్నదానానికి చేయూతనిద్దాం
ట్రస్ట్ ద్వారా “ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం” అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని,మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, రాజేశ్వరి, జక్కం నాగమణి తిరుపతి సేవకులు ఈగురపు భాస్కర్ జక్కం శివరాం, కాడపాక మహేందర్ పోతరాజుల తిరుపతి డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు,తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.