పార్లమెంటు ఎన్నికల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన కేంద్ర బలగాలకు సత్కారం
*నేటి ప్రజా తెలంగాణ బెల్లంపల్లి* , రామగుండం పోలీస్ కమిషనర్ఎట్ పరిధిలోని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల విధుల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ఎట్ కి వచ్చిన బి ఎస్ ఎఫ్, జి,160 బేటాలియన్ డేవిడ్ లాల్, అసిస్టెంట్ కమాండెంట్ కి, వారి సిబ్బందికి రామగుండం కమిషనర్ ఎమ్. శ్రీనివాసులు , ఐ.జీ. , మంచిర్యాల డి.సి.పి అశోక్ కుమార్ ఐపిఎస్ కృతాన్జ్ఞాతలు తెలిపారు. బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ శాలువాతో సత్కరించి మెమొంటో అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏసిపి రవికుమార్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో విధుల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కి వచ్చిన బి ఎస్ ఎఫ్ జి, 160 బేటాలియన్ అధికారులు సిబ్బంది క్రమశిక్షణ, నిబద్దతతో వారికి అప్పగించిన విధులను సమర్థవంతంగా, కమిషనర్ఎట్ పోలీసులకు సహకరిస్తూ ఇక్కడ ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా , ఎలాంటి ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించడం జరిగిందని, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కి సహకరించిన సిబ్బందికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపి రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలొద్దీన్, తాళ్లగురిజాల ఎస్ఐ నరేష్, బిఎస్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు.