స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ.
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలి : పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్
నేటి ప్రజా తెలంగాణ బెల్లంపల్లి రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి పోలింగ్ బూత్ దగ్గర పోలీసు శాఖ తరుపున కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇక ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది, అని, ఈవిఎం ల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు అంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ., ఐజి అన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధి పెద్దపల్లి జిల్లా మంథని, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గల ఈవిఎం ల భద్రత కోసం ఏ ఎన్ టి యు, ఇంజనీరింగ్ కళాశాల, పన్నూర్, రామగిరి మండలం లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మరియు మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గంల ఈవిఎం ల భద్రత కోసం ఐజా ఇంజనీరింగ్ కళాశాల, ముల్కల, మంచిర్యాల స్ట్రాంగ్ రూమ్స్ ను సందర్శించి భద్రత ఏర్పాట్లు లను పోలీస్ అధికారులతో కలిసి సీపీ పరిశీలించి అధికారులకు సూచనలు పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్స్ దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తుతో భద్రపరిచామని తెలిపారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 144 సెక్షన్‌తో పాటు మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నాం అని స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పహారా కాస్తున్నారు. ఎలాంటి ప్రమాదానికి, అగ్నిప్రమాదానికి అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచాం. స్ట్రాంగ్ రూం ల వద్ద 24 గంటలూ సాయుధ రక్షణలో ఉంటుంది, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుంది అన్నారు., ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఒక ఏసీపీ పర్యవేక్షణ లో ఒక సీఐలు, ఇద్దరు ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బందితో 24 గంటలు విధులు విధులు నిర్వహిస్తున్నారు. అని అన్నారు.
సీపీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ రమేష్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, టాస్క్ ఫోర్స్ మల్లారెడ్డి, రామగుండం సీఐ అజయ్ బాబు, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, మంచిర్యాల మహిళ పిఎస్ ఇన్స్పెక్టర్ వెంకట నర్సయ్య, ఎస్ఐ లు ఉన్నారు.